తిక్క రూల్స్ తో తుగ్లక్ పాలన

December 08, 2015 | 04:24 PM | 2 Views
ప్రింట్ కామెంట్
arvind_kejriwal_odd_even_policy_niharonline

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేజ్రీవాల్ హయాంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు బ్రేకులు పడనున్నాయా? ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి అసలు ప్రజల నుంచి మద్ధతు ఉందా? సరి-బేసి పాలసి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి కారణమైన నిబంధన. సరి బేసి సంఖ్యలు నంబర్ ప్లేట్ లుగా ఉన్న కార్లు రోజు విడిచి రోజు రోడ్ల మీదకు రావాలని తద్వారా కాలుష్యం నియంత్రించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలన్న ఆలోచనలో ఉంది. అయితే ఆచరణలోకి రాకముందే దానికి అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి.

                       ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి చెందిన శ్వేత కపూర్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజలపై ఏమాత్రం కరుణ లేకుండా ఇలాంటి చట్టాలు తీసుకొస్తే మా పరిస్థితి దారుణంగా మారుతుంది' అని పిటిషన్ లో పేర్కొన్నారు. సరి భేసి సంఖ్యల ఆధారంగా కార్లను రోజు విడిచిరోజు రోడ్డుపైకి అనుమతించే విధానాన్ని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం పరిశీలనలు జరుపుతుందని, అసలు సమస్యకు మూలమేమిటనే విషయాన్ని పక్కకు పెట్టి ఇలా ప్రజలకు నచ్చని విధానాలు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. 'ప్రజలతో మమేకమవకుండా, ప్రజలకు చెప్పకుండా, వారితో చర్చలు జరపకుండా తీసుకొచ్చే ఎలాంటి ప్రభుత్వ పాలసీలైనా చట్టాలైన వివాదాలను తీసుకొస్తాయి. సమస్యలను అర్ధం చేసుకోకుండా ప్రజలకు చెప్పకుండా తీసుకొచ్చిన ఈ చట్టాలు గతంలో వివాదాలు సృష్టించాయని ఇప్పటికే తెలుసని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.

కాలుష్యానికి అసలు కారణమేమిటో పరిశీలించకుండా ప్రజలపై ఇలా దయలేకుండా, నియంతృత్వ ధోరణితో విధానాలు తీసుకుంటే జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఆయనకు అర్థం కానట్లుంది. సొంత వాహనాలపై తిరిగే వారు ముఖ్యంగా మహిళలు, వికలాంగులు ఈ విధానంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికే పాలనాపరమైన నిర్ణయాలతో ఇబ్బందుల్లో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక ఇప్పుడు ఈ తాజా నిర్ణయంతో ఇబ్బందులో పడిపోయింది. విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా ఇలా తుగ్లక్ పాలన కొనసాగిస్తే భవిష్యత్తులో పరిణామాలు దారుణంగానే ఉంటాయన్నది కేజ్రీవాల్ గుర్తిస్తే మంచిది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ