అమ్మా కొడుకులు డుమ్మా కొట్టారే!

December 08, 2015 | 11:35 AM | 1 Views
ప్రింట్ కామెంట్
national-herald-case-sonia-rahul-absent-niharonline

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమె తనయుడు రాహుల్ గాంధీలపై వచ్చిన ఆరోపణల ఆధారంగా విచారణకు హజరు కావాల్సిందిగా వీరిద్దరిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాను ఇందిరాగాంధీ కొడలినని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సోనియా మీడియాతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు మంగళవారం కోర్టుక హాజరు అవుతారా లేదా అన్నది కాస్త ఉత్కంఠగా ఉంది. అయితే అనుకున్నట్లుగానే వారిద్దరూ డుమ్మా కొట్టారు.

సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ కేసులో 5000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను గోల్ మాల్ చేసినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ది నేషనల్ హెరాల్డ్ ను  1938లో ప్రప్రథమ ప్రధాని నెహ్రూ స్థాపించాడు. అయితే 2008లో తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ పేపర్ ను సోనియాగాంధీ మూసివేయించింది. మూసివేసే సమయంలో దాదాపు 90 కోట్ల లోన్ కట్టబెట్టినట్లు, యూపీఏ ప్రభుత్వం తరపున వీరు పెద్ద స్కాం చేసినట్లు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఓ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుతో పాటు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న సోనియా, రాహుల్ గాంధీల పిటిషన్లను నిన్న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సోనియా అభ్యర్థన సమంజసంగా లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో నేడు జరగనున్న విచారణకు హాజరయ్యే నిమిత్తం సోనియా, రాహుల్ లు ట్రయల్ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు నేటి కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది.

                           ఆదేశాలను లైట్ తీస్కున్న వీరువురు గైర్హాజరు అయినట్లు అనిపిస్తోంది. నేటి ఉదయమే రాహుల్ గాందీ పుదుచ్చేరి పర్యటనకు వెళ్లిపోయారు. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ సోనియా గాంధీ కూడా కోర్టుకు వెళ్లలేదు. కాంగ్రెస్ పార్టీ నేతల తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సంఘ్వీ కోర్టుకు వెళ్లారు. ఇక పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సాహంగా కోర్టుకు వచ్చారు. తన న్యాయవాదులతో పాటు ముఖ్య అనుచరులతో కలిసి ఆయన కోర్టుకు వచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు, వారు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని చెప్పటం విశేషం. కానీ, డిసెంబర్ 19న ఎట్టి పరిస్థితుల్లో వారిద్దరూ కోర్టుకి హజరుకావాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ