లల్లూ అశ్వమేధ యాగానికి గడ్డి కావలెను!

August 01, 2015 | 06:13 PM | 2 Views
ప్రింట్ కామెంట్
lalu_prasad_yadav_horse_rally_peta_bihar_election_niharonline

పెటా అనే సంస్థ మూగజీవాల్ని ఆదుకునేందుకు రూపుదిద్దుకున్నది. ఈ సంస్థల సభ్యులకు తెలిస్తే జంతువులపై జరిగే అఘాయిత్యాల్ని అడ్డుకుంటుంది. బీహార్ లో ఎన్నికలొస్తున్నాయి. ఎన్నికలంటే ప్రచార కోలాహలం, ఆర్భాటం మస్తుగా ఉండి అలా పొడిచేస్తాం, మీ జీవితాలకి బంగారు పూత పూసేస్తాం అని చుక్కలు చూపిస్తారు. బీజేపీ బాస్ ‘బాహుబలి అమిత్ షా’ బీహార్ కోటలో ఏమైనా సరే పాగ వెయ్యాలని హైటెక్ పరివర్తన్ రథాలనుపయోగించి ఓటర్లను ఆకట్టుకునే పథకం రచించేడు. దీనికి ‘భళ్లాలదేవుడు లాలూ ప్రసాద్’ ప్రతిగా వెయ్యి గుర్రపు బండ్లను రంగంలో దింపి దుమ్మురేపుదామని ఆలోచన. శ్రీ యాదవ్ గారి ఆలోచన ప్రకారం డబ్బున్న బీహారీలు పార్టీ ఫండు ఎలాగూ ఇవ్వరు,  గుర్రపు బండ్ల ద్వారా పేదలను బుట్టలో వేసుకోవచ్చునని.

ఎన్నికల సందర్భంగా బుజ్జి గుర్రాలన్నీ లల్లూ ధాష్టీకానికి బలయిపోయి, మెడభాగంలో పుళ్లుపడి జ్వరం వస్తాయని సదరు సంస్థ సదుద్ధేశ్యంతో రంగ ప్రవేశం చేసి ఎన్నికల నియామకాల్ని ఉదహరిస్తూ ఈ గుర్రపుబగ్గీల వ్యవహారం కుదరదని అంటున్నాయి. అలా అని ఊరు కోలేదు. ఎన్నికల సంఘానికి పితూరి చేసేశాయ్. జంతుహింసా నివారణ సంఘం కొంచెం శాంతించి, సంయమనం పాటించి ఈ దఫా ఎన్నికలకు గుర్రాల్ని పణంగా పెట్టగలిగితే, ఏమవచ్చో తెలుసా? గుర్రం భాయిలు ఏం భోం చేస్తారు.. గడ్డి... ఏ గడ్డి తిని ఈ వెయ్యి గుర్రాలు అశ్వమేథ యాగానికి గడ్డి ప్రోగు చేస్తాడో లల్లూ ప్రసాదు,  వేచి చూడొచ్చుకదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ