నరేంద్ర మోదీ పేరుతోనే పాపులర్ అయ్యి బారత్ లో పదేళ్లు నాటుకు పోయిన యూపీఏ పునాదులను పెకలించి మరీ ప్రధాని పీఠంపై కూర్చున్నాడు. ఇక అధికారంలోకి రాగానే అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయి అందరి నోళ్లలో నానుతున్నాడు. ప్రపంచ ప్రభావశీలమైన వ్యక్తుల జాబితాలో ఆయనది టాప్ పొజిషన్ కూడా. వరుస టూర్ల పుణ్యమాని దేశ విదేశాల్లోని వారికి ప్రియతమ నేతగా మారిపోయాడు. మరి అదే టైంలో భారత్ లో ఆయన పరిస్థితి ఏంటీ?
ప్రస్తుతం ఆయన టైమ్ అస్సలు బాగోలేదు. ప్రధాని పదవికి ప్రకటించిన సమయంలో గుజరాత్ లో ఆయన చేసిన అభివృద్ధి నమునాగా తీసుకుని ప్రచారంకి వెళ్లాడు. సోషల్ మీడియాల సహకారంతో ఈజీగా జనాల్లోకి ముఖ్యంగా యువతలోకి ఆయన పేరు ఎక్కేసింది. దీంతో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చేశాడు. అయితే పాలనలోకి వచ్చాక ఆయన ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదనే చెప్పాలి. రాను రాను ప్రజల్లో బీజేపీ పట్ల అనటం కంటే మోదీ పైనే వ్యతిరేకత మొదలౌతుందన్నది నిజం. బీహార్ శాసనసభ ఎన్నికల పరాభవాన్ని అందుకు ప్రత్యక్ష తార్కాణం. మరి ఆ ఫలితాలు మర్చిపోకముందే ఆయనకిప్పుడు మరో పెద్ద షాక్ తగిలింది.
మోదీ కంచు కోటగా భావిస్తున్న గుజరాత్ లో ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే అది స్వల్ఫ మెజార్టీతోనే కావటం గమనార్హం. అనుహ్యారీతిలో అక్కడ కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. దీంతో చచ్చి చెడి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఇక్కడ మోదీ సొంత మున్సిపల్ కార్పొరేషన్ ను సైతం కాంగ్రెస్ చేజిక్కించుకోవటం విశేషం. ఇక ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణులకు మింగుడు పడకుండా ఉన్నాయి. మోదీ పై వ్యతిరేకత మెల్లిగా పెరుగుతుందనటంపై ఈ ఎన్నికలు మంచి ఉదాహరణగా మారాయని కాంగ్రెస్ దెప్పిపొడుస్తుంది.