భారత్ తోసత్సంబంధాలు కోరుకుంటున్నాం : నవాజ్

January 28, 2015 | 06:03 PM | 38 Views
ప్రింట్ కామెంట్

పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న దేశాలన్నింటితో మంచి సంబంధాలు కోరుకుంటోందని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తాజాగా పేర్కొన్నారు. భారత్ లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సమావేశం సందర్భంగా, పాకిస్తాన్ కు భారత్ ముఖ్యమైన పోరుగు దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన అధికారిక పత్రికా ప్రకటనలో...ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య ప్రస్తుతమున్న సంబంధాల పరిస్థితిని షరీఫ్ కు బాసిత్ వివరించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండు దేశాల మధ్య జమ్ము కాశ్మీర్, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకోవడం కూడా ముఖ్యమని బాసిత్ సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ