భారత్ లో పర్యటన ముగించుకుని వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత మత సహనంపై ఆయన ఉపన్యాసం ఇవ్వడం సరికాదన్నారు. ఆయన పనేదో ఆయన చూసుకోవాలే తప్ప ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం తగదని చెప్పారు. అమెరికాలో రెండు మిలియన్ల మంది భారతీయులున్నారు. అక్కడ వారు దేవాలయాలు నిర్మించుకునేందుకు అనుమతించరు, దీపావళి జరుపుకునేందుకు అనుమతించరు. కానీ, ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు. అమెరికాలో సామరస్యం సాధించామని చెబుతారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు హిందువులను పశువులకన్నా హీనంగా చూస్తారు. భారత్ లో అయితే 800 ఏళ్లుగా ఇస్లామిక్ మైనారిటీ వర్గం మెజారిటీ హిందువులను వేధిస్తోంది అని పేర్కొన్నారు.