పోలవరం పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారా?

May 07, 2015 | 05:30 PM | 166 Views
ప్రింట్ కామెంట్
Umabharti_on_polavaram_niharonline

ఆంధ్రప్రదేశ్ కు గొప్ప వరం అని పేర్కొంటూ ఇన్నాళ్లు నాన్చుతున్న మెగా ప్రాజెక్టు పోలవరం పై లోక్ సభలో గురువారం కేంద్రం ప్రకటన చేసింది. ప్రాజెక్టును అనుకున్న సమయంలో నిర్మించి తీరుతామని పార్లమెంట్ లో తెలిపింది. కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ... పోలవరాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నామని, జాతీయ హోదా ప్రకటించినప్పుడే ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పోలవరంతో 222 గ్రామాల్లోని లక్షా 88వేల మంది నిర్వాసితులౌతారని, ఆరు గ్రామాల్లోని 1730 మందికి పునరావాసం కల్పించాలని స్పష్టంచేశారు. పోలవరం పనులు ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతాయని ఆమె చెప్పారు. ఏదేమైతేనేం ఎట్టకేలకు పోలవరం పై కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ