వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ కు ఊరట

May 07, 2015 | 12:39 PM | 204 Views
ప్రింట్ కామెంట్
rahul_gandhi_RSS_case_supreme_court_niharonline

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న పరువు నష్టం కేసులో గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను జులై 8 కి వాయిదా వేసింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ... మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్సే చంపిందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆర్ఎస్ఎస్ నేత రాజేస్ కుంటే రాహుల్ పై ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలంటూ గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ