కాంగ్రెస్-బీజేపీ దోస్తీ... ఆడియో టేపులు లీక్!

December 30, 2015 | 02:21 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Antargarh-by-election-fixed-BJP-congress-niharonline

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం ఛత్తీస్ గఢ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ బీజేపీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్  మధ్య జరిగిన ఎలక్షన్ ఫిక్సింగ్ కు సంబంధించి ఆడియో టేపులు వెలుగు చూడటంతో ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో కలకలం రేగుతోంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని బుగ్గయిపోయే స్థితి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అయినా అస్సలు సహకరించుకోవు. ప్రతి విషయంలోనూ వాదులాడుకుంటున్నాయి, దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నిత్యం ఈ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరుగుతోంది. మంచి చేద్దామన్న నిర్ణయంపై ఏకతాటిపైకి వచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇరు పార్టీల మధ్య దోస్తీ ఏంటనే మీ అనుమానం.

బీజేపీ పాలిత రాష్ట్రం ఛత్తీస్ గఢ్ కు సీఎంగా ప్రస్తుతం రమణ్ సింగ్ ఉన్నారు. రాష్ట్రంలోని అంతాగఢ్ అసెంబ్లీకి ఏడాది క్రితం (2014లో) జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి ఇరు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంతూరామ్ పవార్ చివరి నిమిషంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి భోజ్ రాజ్ నాగ్ సునాయసంగా గెలిచిపోయారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణపై పెద్ద చర్చే నడించింది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన సంచికలో ఓ కథనాన్ని రాసింది.

అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి చేత నామినేషన్ ఉపసంహరించుకోగా, బీజేపీ అభ్యర్థి గెలిచిపోయారని సదరు ఆంగ్ల పత్రిక సాక్ష్యాలతో సహా కథనం రాసేసింది. రమణ్ సింగ్ అల్లుడు పునీత్ గుప్తా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంతూరామ్ పవార్ లతో మాట్లాడినట్లుగా భావిస్తున్న టెలిఫోన్ సంభాషణలను ఆ కథనం ప్రస్తావించింది. ఈ కథనంపై అజిత్ జోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ఉత్తదేనని, పత్రికపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అయితే అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని చెప్పి దాట వేత ధోరణి ప్రదర్శించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ