ప్రెసిడెంట్ దాదా తేనేతుట్టెను కదిలించారు!

May 26, 2015 | 11:45 AM | 22 Views
ప్రింట్ కామెంట్
president_pranab_mukherjee_bofors_scam_niharonline

బోఫోర్స్ కుంభకోణం సుమారు 30 ఏళ్లుగా దేశాన్ని కుదిపేస్తున్న ఓ భారీ కుంభకోణం. స్వీడన్ కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి అందించేందుకు 1986 లో రూ.1500 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోగా, అందులో రూ.64 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారినట్లు అభియోగాలు వచ్చాయి. అంతేకాదు ఈ కుంభకోణం దాటికి 1989 లో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. ఇక ఈ కేసులో ప్రధాన పాత్రధారి ఖత్రోచీ 2013 జులైలో ఇటలీలోని మిలాన్ లో మృతిచెందాడు. దాదాపు 30 ఏళ్లుగా నానుతున్న ఈ శతఘ్నల తేనెతుట్టెను మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మళ్లీ కదిలించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోఫోర్స్ అనేది అసలు కుంభకోణమే కాదని తేల్చేశారు. బోఫోర్స్ ఒప్పందం స్కాం అని మీడియాలో మాత్రమే వచ్చింది. దానిని కుంభకోణం అని ఎలా నిర్థారిస్తారని పేర్కొన్నారు. త్వరలో స్వీడన్ పర్యటన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అన్నట్లు  ప్రణబ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రక్షణ, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ