కాపు ఎఫెక్ట్: బాబుకి సొంత ఎమ్మెల్యే వార్నింగ్

February 08, 2016 | 05:12 PM | 3 Views
ప్రింట్ కామెంట్
krishnaiah-warning-chandrababu-on-kapu-reservation-niharonline

ఒకప్పట్లో తన పేరును తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు చంద్రబాబు పట్ల భక్తి ప్రపత్తులతో ఊగిపోయారు. కానీ, ఆ తర్వాత నెమ్మదిగా కనుల ముందు పొరలు తొలగిపోయినట్లుగా ఉంది. నామమాత్రపు ఎమ్మెల్యే పదవి తప్ప ఏమాత్రం గుర్తింపు లేకపోవటం ఆయన్ను బాధించినట్లుంది. అందుకే అధినేతకే ఎదురు తిరిగే ఆలోచనలో ఉన్నారు బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య. ఏపీలో ప్రస్తుతం కాపులను బీసీల్లో చేర్చటం అనే అంశంపై రగులుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే.

                                       రాజకీయాలోచనతో కాపులను బీసీల్లో చేరిస్తే ఉద్యమాలు తప్పవంటూ ఈ బీసీ సంఘ నాయకుడు హెచ్చరిస్తున్నారు. బీసీ కమిషన్‌ పూర్తిస్థాయిలో సిఫారసు చేస్తే కాపులను చేర్చాలే తప్ప రాజకీయాల కోసం వక్రమార్గాలు తొక్కితే సహించేది లేదని అంటున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటే సశాస్త్రీయమైన అధ్యయనం జరగాలని సూచించారు. ముందుగా కాపుల వాస్తవ జనాభా ఎంతో నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ఉద్యోగాలు, ప్రభుత్వ సౌకర్యాల్లో వారు అనుభవించేది ఎంత శాతం? అన్నది అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఆ తరువాత ఇతర బీసీల సంఖ్యతో దానిని మదించాలని, అప్పుడు వారు అనుభవిస్తున్న సౌకర్యాలతో కాపులు అనుభవిస్తున్న సౌకర్యాలను కూడా మదించి నిగ్గుతేలిస్తే బీసీల్లో కాపులను చేర్చడం సమంజసమా? కాదా? అన్నది తేలుతుందని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగ సవరణ లేకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదన్న ఆయన, విధ్వంసం జరిగితే సౌకర్యాలు కల్పిస్తామంటే చాలా వర్గాలు విధ్వంసాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ