సాక్షికి పంచ్: మన తల్లులేం పిల్లల్ని కనే మిషన్లు కాదు

February 18, 2015 | 12:31 PM | 22 Views
ప్రింట్ కామెంట్
Sakshi_Maharaj_Mohan_baghath_niharonline

అధికార పార్టీ ఎంపీల మత సంబంధింత వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా వారు తమ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల కంటే మిత్ర పక్షాల నుంచే ఎక్కువగా వారు విమర్శులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ మధ్య ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్ ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనటం ద్వారా హిందూ మతాన్ని కాపాడేందుకు పాటుపడాలని పిలుపునిచ్చాడు. దీనిపై ఎన్ని విమర్శలు వెలువెత్తాయో తెలిసిన విషయమే. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన మహిళలు సంతానోత్పత్తి చేసే ఫ్యాక్టరీలు కాదని ఆయన అన్నారు. కాన్పూర్ లో జరిగిన సంఘ్ పరివార్ సమావేశంలో భగవత్ మాట్లాడుతూ... ‘‘మన తల్లులేమీ ఫ్యాక్టరీలు కాదు. పిల్లలను ఉత్పత్తి చేయడానికి. అయినా ఓ బిడ్డకు జన్మనివ్వటం అనేది వ్యక్తిగత విషయం. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ముందూవెనకా ఆలోచించి మట్లాడాలి’’ అని ఆయన సాక్షిమహారాజ్ కు సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ