మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత ఆర్.ఆర్.పాటిల్ సోమవారం సాయంత్రం ముంబై లీలావతి ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన నోటి కాన్సర్ తో బాధపడుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా, తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఆయన 2008 ముంబై పేలుళ్ల సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.