ఎంత భిన్న సిద్ధాంతాలపై పనిచేస్తున్నప్పటికీ, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఎన్నోమార్లు రుజువైంది. తాజాగా కేరళలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జతకట్టినట్టు తెలుస్తోంది. అయితే, ఆర్ఎస్ఎస్, ఐయూఎంఎల్ పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
ఆర్ఎస్ఎస్ నేత పి.గోపాలన్ కుట్టి, ఐయూఎంఎల్ నేతలు కలిసి ఈ విషయమై చర్చించారని, పార్టీ కార్యకర్తల విజ్ఞప్తులను మరచిన ఐయూఎల్ఎం నేతలు సెక్యులరిజాన్ని మరచి ఓట్ల కోసం కరుడుగట్టిన హిందుత్వ పార్టీతో చేతులు కలిపారని సీపీఐ (ఎం) నేతలు తీవ్ర విమర్శలు మొదలు పెట్టారు. కాగా, ఈ సంవత్సరం మే లేదా జూన్ నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కేరళలో ఐయూఎంఎల్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కొనసాగుతన్న సంగతి తెలిసిందే. ఇండియన్ పొలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే.