రైతుల కోసం రాహుల్ పాదయాత్ర షురూ

April 30, 2015 | 12:14 PM | 124 Views
ప్రింట్ కామెంట్
rahul_gandhi_begins_his_padyatra_niharonline

కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గురువారం కిసాన్ పాదయాత్ర ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకునే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని గ్రామాల నుంచి రోజుకు పది హేను కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. తొలుత గంజి అనే గ్రామానికి చేరుకున్న ఆయన అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. రాహుల్ తోపాటు పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులను చిన్నచూపు చూస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తీవ్రంగా బుధవారం పార్లమెంటులో విమర్శించిన విషయం తెలిసిందే. విదేశీ పర్యటనలు పక్కన బెట్టి ముందు రైతుల దగ్గరికి వెళ్లాలని ఆయన చురకలు అంటించారు కూడా.  రైతులు దేశాన్ని నిర్మించలేరా అని ఆయన మోదీని కడిగిపడేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ