బొగ్గు కుంభకోణం కేసులో దర్శకరత్న దాసరి నారయణ రావుకు ఉచ్చు బిగిసేలా ఉంది. ఈ కేసు కీలక ముందడుగులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం చార్జ్ షీట్ దాఖలు చేసింది. నవీన్ జిందాల్ సహా 14 మందిపై అభియోగపత్రం దాఖలైంది. అందులో దాసరి పేరును కూడా దర్యాప్తుసంస్థ చేర్చింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి,గుప్తాల పేర్లు కూడా అభియోగపత్రంలో ఉన్నాయి. అమరకొండ(జార్ఖండ్) బొగ్గుగని కేటాయింపులో ఈ చార్జ్ షీటు దాఖలైంది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైంది.