దేశ ప్రధానిగా మోదీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. ఇక ఈ సంవత్సర పాలనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఏకీ పాడేశాడు. ప్రధానిగా ఫారిన్ టూర్లే తప్ప, దేశానికి వెన్నెముక లాంటి రైతుల గురించి పట్టించుకోవట్లేదని రాహుల్ విమర్శించాడు. విదేశాల్లో సెల్ఫీలు దిగటం గురించి కాకుండా, ఇక్కడున్న ఎంతో మంది నిరుద్యోగ యువకుల భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించటం పక్కనబెట్టి ముందుగా సొంత పాలనను సరిదిద్దుకోవాలని సలహా ఇచ్చారు. ఈ ఏడాది పాలనకు 10 పాయింట్లకు గానూ తానిచ్చే రేటింగ్ 0 అని, ప్రధానిగా మోదీ సొంత ఖ్యాతి సంపాదించుకోవటం తప్ప దేశానికి ఒరగబెట్టిదేం లేదని విమర్శించారు. తన సొంత నియోజకవర్గం ఆమేథీలో పర్యటిస్తున్న ఆయన అక్కడ పంట నష్టపోయిన రైతులను కలుసుకున్నాడు. మూడు రోజులపాటు ఆయన అమేథీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల నిర్మించతల పెట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ తెలిపారు.