పొరుగు దేశాలతో సత్సబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించడం మంచిదే. అలాగని వారిని గుడ్డిగా నమ్మోద్దంటూ దేశ ప్రధాని మోదీకి శివసేన సూచిస్తుంది. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని గట్టిగా భావిస్తున్నప్పటికీ, గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహారించాలని హెచ్చరించింది. చైనా వాళ్లు అపాయ్యంగా కౌగిలించుకుని, వీపుల్లో కత్తులు దించుతారని పేర్కొంది. ఇఫ్పటివరకు వారు మన దేశం పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టమౌతుందని తన అధికార పత్రిక సామ్నా లో పేర్కొంది. ఓ వైపు అక్కడ మన ప్రధాని ఉండగానే, చైనా అధికారిక టీవీ చానెల్ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు లేని చూపడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించింది. ఇది చైనా కపట వైఖరికి, కుటిల బుద్ధికి నిదర్శమని పేర్కొంది.