బజాజ్ ఆటోలను తగలబెట్టేస్తానంటున్న థాక్రే

March 10, 2016 | 11:39 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Raj-Thackeray-bajaj-autos-niharonline

మహారాష్ట్రలో మరాఠీ వారి హక్కుల కోసం పోరాడే పార్టీగా బాల్ థాక్రే ఆధ్వర్యంలో ఆవిర్భవించింది శివసేన. మాఫియాను సైతం గడగడలాడించిన ఆ పెద్దాయన మేనల్లుడు అయి ఉండి విబేధాలతో సొంతపార్టీ పెట్టుకున్నాడు రాజ్ థాక్రే. ఆపై పొత్తులపై ఆసక్తి లేకపోవటంతో అరకొర సీట్లతోనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని నడిపిస్తున్నాడు. బీజేపీతో శివసేన మైత్రి కారణంగా మరీ కాలి ఈ మధ్య తరచూ విమర్శలకు దిగుతున్నాడు. తాజాగా 70 వేల ఆటోలను తగులబెట్టేస్తామని రాజ్ థాక్రే హెచ్చరికలు జారీచేశాడు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆటోల పర్మిట్లు రాష్ట్రేతరులకే ఎక్కువ వస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

                       నిజానికి మహానగరంలో పరుగులు తీస్తున్న ఆటోల్లో 70 శాతం రాష్ట్రేతరులవేనట, అందుకే  ఆయన అంతలా మండిపడుతున్నాడు. ఇకపై కొత్త పర్మిట్ లు తీసుకున్న ఆటోలు కనపడితే వాటిల్లోని ప్రయాణికులను దించేసి అక్కడే దానిని తగులబెడతామని ఆయన చెప్పారు. త్వరలో మరో 70 వేల ఆటోలను నడుపుకునేందుకు రాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వనున్నారని సమాచారం తమ దగ్గర ఉందని, ఆ ఆటోలు రోడ్డు మీదికి వస్తే తగులబెడతామని ఆయన హెచ్చరించారు. కేవలం బజాజ్ కంపెనీ బాగుపడేందుకే ప్రభుత్వం కూడా ఒప్పందాలకు మొగ్గుచూపుతుందని ఆయన ఆరోపిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాజ్ థాక్రే వ్యాఖ్యలపై మండిపడింది. తోటి భారతీయుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి బాధ్యతరాహిత్యం అని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం రవాణా మంత్రిత్వ శాఖ శివసేన చేతుల్లోనే ఉంది, మరి ఈ విషయంలో వారి వాదన ఏంటో, ఏం చెబుతారో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ