రాజస్థాన్ సీఎం రాజ్యాంగాన్ని అవమానించినట్లే!

September 23, 2015 | 11:49 AM | 1 Views
ప్రింట్ కామెంట్
vasundara-raje-reservation-quotas-to-gujjar-EBC-niharonline

ఓటు బ్యాంకు కోసం నేతలు ఎంతకైనా దిగజారతారనేది మరోసారి రుజువైంది. అవరసరమైతే అత్యున్నత రాజ్యాంగాన్ని సైతం అవమానించే రీతిలో కూడా వెనకాడరు. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇలాంటి పనే చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గుజ్జర్లు, బీసీల ఓటు బ్యాంకు గల్లంతు కాకుండా ఉండేందుకు తెగ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ రాష్ట్రంలో అమలులో లేని, ఆచరణ సాధ్యం కానీ నిర్ణయం ఒకటి తీసుకొని దేశ వ్యాప్తంగా దుమారం రేపారు.

మన రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటకూడదు. కానీ, ఓటు బ్యాంకును కాపాడుకునే ఏకైక లక్ష్యంతో బీజేపీ పాలిత రాజస్థాన్ లో వసుంధరా రాజే ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను 69 శాతానికి పెంచింది. గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (స్పెషల్ బ్యాక్ వర్డ్ క్లాస్ - ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం కోటాను ఇవ్వాలన్న బిల్లులను ఆమోదించింది. దీని ప్రకారం విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి అదనంగా కోటా లభిస్తుంది.

నిజానికి గుజ్జర్లు కోటా డిమాండ్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వారిది సమ్మతమైన డిమాండే. కానీ, వారి తర్వాత అత్యధికంగా ఉన్న బీసీలపై అవసరం లేని ప్రేమను కురిపిస్తూ ఏకంగా 14 శాతం కోటా ను క్రియేట్ చెయ్యటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేందుకు తీరిగ్గా కేంద్రం వంక చూస్తుంది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపాదించిన ఈ రెండు బిల్లులనూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని మోదీ ప్రభుత్వానికి వసుంధరా విజ్నప్తి చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో తమ నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకుండా చూడాలన్నదే రాజస్థాన్ సర్కార్ ఆరాటం. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే... దేశంలో అసలు రిజర్వేషన్లే వద్దని, ఈ విధానాన్ని సమీక్షించాలని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్రాన్ని కోరిన మరుసటి రోజే రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ