సందు దొరికిందని దూరేస్తున్నారు!

September 15, 2015 | 05:16 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Ananda-Bhaskar-begging-nalgonda-for-handloom-worker-suicide-niharonline.jpg

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓవైపు రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ ప్రభుత్వంపై వీటి గురించి దుమ్మెత్తిపోస్తున్నాయ్.. కేసీఆర్ వీటిపై స్పందించాలని, అసలు ఆయన ఏం పట్టించుకోవడం లేదని వారంతా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను ఎలా ఎదుర్కొవాలో సమాయత్తమయ్యే లోపు తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పుడు మరో బాంబు పడింది. దీనికి ఇప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా తోడైయ్యాయి. అయితే ఆత్మహత్యలు ఏమో గానీ వారివల్ల ప్రతిపక్షాలకు మాత్రం వీటివల్ల అధికార పక్షంపై దాడిచెయ్యడానికి ఓ మంచి పాయింట్ దొరికినట్లయ్యింది. ఇక ఇదే సందు అన్నట్లు నేతలు దూరిపోతున్నారు.

విభజన తర్వాత పూర్తి ప్రాభవ్యం కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. ఇక అప్పటి నుంచి నాయకులంతా ఏదో రకంగా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సైలెంట్ గా ఉంటే పని అవ్వదు కదా మరి. మీడియా సమావేశాలు, గట్రా పెట్టి బాగానే ఫోకస్ లోకి వస్తున్నారు. మరి అలాంటిది ఆత్మహత్యలనే పాయింట్ ను ఊరికే వదులుతారా? ఇక తాజాగా ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తన చతురత ను ప్రదర్శించారు.

నల్గొండ లోని భూదాన్ పోచంపల్లిలో పగడాల నగేష్ అనే ఒక చేనేత కార్మికుడు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆనందభాస్కర్ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ఇక అక్కడ తన శైలిని ప్రదర్శించారు. నగేశ్ కుటుంబానికి ఆర్థిక సాయం చెయ్యాలని జోలి పట్టి ఊరంతా భిక్షాటన చేశారు. అలా చెయ్యాగా వచ్చిన రూ.50 వేలను ఆ కుటుంబానికి అందజేశారు. చివరగా.. ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన సలహా కూడా ఇచ్చారు. అయినా ఆదుకోవాలంటే ఆయనగారు అడుక్కోవాలా... జేబులోంచి తీయ్యోచ్చుగా అని కొందరు గ్రామస్తులు ఓపెన్ గానే మాట్లాడేశారట. ప్రజల కళ్లలో పడాలంటే ఇలాంటి సర్కస్ ఫీట్లు తప్పని సరి అని మరోసారి నిరూపించారు ఈ కాంగ్ లీడర్ గారు. లేకపోతే మాయమైపోతారు కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ