తెరవెనుక కథలు ఇంకేంత కాలం?

September 15, 2015 | 11:28 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Rahul-Gandhi-nara-lokesh-niharonline.jpg

రాజకీయాల్లో వారసత్వాలు కామనే. తాతల దగ్గరి నుంచి తమ తర్వాతి తరాల వరకు ఆ రక్తాన్నే ఎక్కిస్తూ  రాణిస్తున్న వారు ఎంతోమంది. లింగ బేధం, విద్యార్హతలు ఏవైనా సరే ఎంత లేటు వయసైనా సరే దిగిపోతున్నారు. క్రియాశీలక వ్యవహారాల వరకైతే ఓకే గానీ, పదవులకు మాత్రం వారు ఎప్పటికీ నో నే. ముఖ్యంగా అధినేతల విషయంలోనే ఇది మరీను. సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు వారి వారి వారసులను రాజకీయ రంగంలోకి దించేస్తుంటే... అధినేతలు మాత్రం వారికి ప్రస్తుతం ప్రాధాన్యం ఇవ్వటం లేదు.

కాంగ్రెస్ నే చూసుకుంటే రాహుల్ గాంధీ పరిస్థితి అంతే. పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. నిర్ణయాలు అధినేత్రి, అమ్మ సోనియాతో కలిసి తీసుకుంటాడు. కానీ, క్రెడిట్ అంతా సోనియాకే దక్కుతుంది. ఈ మధ్య పార్టీ పగ్గాలు అప్పజెప్పుతారన్న వార్తలు వచ్చినప్పటికీ అది కొంతకాలం పోస్ట్ పోన్ అయ్యింది.  2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పట్టించుకోకున్నా... పార్టీలో రాహుల్ ప్రాబల్యం ఉందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అయినా రాహుల్ కి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వక పోవటం వెనుక కారణలేవైనా ఉండొచ్చు. కానీ, సీనియర్ల పర్యవేక్షణలో కాస్త కుస్తో రాటు దేలిన రాహుల్ కి ఎంత త్వరగా పగ్గాలు అప్పజెప్పితే అంత మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేని ఈ స్టేజీలోనే ఇది అప్పజెప్పితే ఇంకా చాలా మంచిదని తెలుస్తోంది.

ఇక సేమ్ సీన్ ఏపీ లోనూ ఉంది. దాదాపు 10 ఏళ్లపాటు అధికారానికి దూరమైన చంద్రబాబు, విభజనతోపాటు, పరిస్థితులు కలిసి రావటంతో అధికారంలోకి వచ్చారు. ఆయన వారసుడిగా నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్లుపైనే అయ్యింది. 2009 ఎన్నికల సమయంలోనే పార్టీ తరపున ప్రచారం చెయ్యటంతోపాటు అభ్యర్థులను ప్రకటించటంలోనూ లోకేష్ దే కీలక పాత్ర. మరి అలాంటి లోకేష్ కి పార్టీలో ప్రాధాన్యం ఏంటి. ఒకరకంగా చంద్రబాబుకి తిరిగి పవర్ లోకి రావటానికి మెయిన్ హ్యండ్ లోకేష్ దే అని చెప్పాలి. ఈ దఫా ఎన్నికల్లో కూడా పార్టీ టికెట్ల పంపిణీ దగ్గరి నుంచి ప్రచారం, పార్టీ కేడర్ ను క్రమశిక్షణలో నడపటం, మరీ ముఖ్యంగా యూత్ ను ఆకర్షించటంలో లోకేష్ కృషి చాలా ఉంది. పార్టీ  ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడతారనే వార్తలు అప్పట్లో వచ్చినప్పటికీ ఇప్పటి దాకా పార్టీలో లోకేష్ కి సముచిత స్థానం లేదనే చెప్పాలి.  మొత్తానికి ఈ ఇద్దరు వారసులు పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ... పదవుల విషయంలో మాత్రం భంగపడుతూ వస్తున్నారని చెప్పొచ్చు. అక్కడ రాహుల్... ఇక్కడ లోకేష్ ఇలా తెరవెనుక రాజకీయాలతో ఇంకేంత కాలం టైంపాస్ చేస్తారో...  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ