దేశరాజధాని నడిబొడ్డున ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న యువతులపై పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారన్నట్టు కనిపిస్తున్న వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అమ్మాయిలని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదటం ఆ వీడియోలో క్లియర్ గా కనిపించింది. లాఠీలతో ఎక్కడపడితే అక్కడ వాయించేసిన పోలీసులపై వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.పోలీసుల చర్యలను ఖండిస్తూ, విద్యార్థినులపై ఇంతటి దారుణ చర్యలేమిటని ఆప్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.
అయితే పోలీసులు అలా ఎందుకు చేశారన్న విషయమై, అంతకుముందు జరిగిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. కొందరు విద్యార్థినులు, దేశ ప్రధాని నరేంద్ర మోదీని రాయడానికి వీల్లేని విధంగా తూలనాడుతూ, దమ్ము, ధైర్యముంటే తమపై చర్యలు తీసుకోవాలని పదే పదే నినాదాలు చేస్తున్నట్టు ఈ తాజా వీడియోలో కనిపిస్తోంది. సోమవారం తొలి వీడియో బయటకు వచ్చిన తరువాత, కాగా, ఓ విద్యార్థిని తన మొబైల్ లో చిత్రీకరించిన ఈ వీడియో తాజాగా పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది.