సమ్మర్ లో కుమ్ముకుంటున్న తమిళ విద్యార్థులు

April 18, 2016 | 01:04 PM | 3 Views
ప్రింట్ కామెంట్
students-1200-rupees-for-day-TN-rally-niharonline

పరీక్షలు ముగిశాయి. సమ్మర్ హాలీడేస్ ఎంచక్కా హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు విద్యార్థులు. ఇది ఆఫీసుల్లో పనిచేస్తూ మధ్య మధ్యలో బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండే కొందరి మనోవ్యథ. కానీ తమిళనాడులో ప్రస్తుతం విద్యార్థులు క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. డబ్బులు తెగ సంపాదించేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. రోజుకీ రూ.1200 చొప్పున వెనకేసుకుంటున్నారు. ఇంతకీ వారు చేసే పనేంటో తెలుసా? ఎన్నికల ర్యాలీలో పాల్గొనటం.

                              ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న తమిళనాడులో, ఒక్కో పార్టీ ర్యాలీ నిర్వహిస్తే, అందుకోసం కనీసం 20 వేల మందిని నేతలు సమీకరించాల్సి వుంటుంది. ఇందుకోసం సమీకరణకు పురుషులకు రూ. 600, మహిళలకు రూ. 800 ఇస్తున్న పార్టీలు, విద్యార్థులు వస్తామంటే పెద్దపీట వేస్తున్నాయి. ఒక రోజు తమ వెంట ఉండి ర్యాలీ, సభలకు హాజరై జేజేలు కొట్టిన వారికి పార్టీలు రూ. 1200 వరకూ ఇస్తుండటంతో, విద్యార్థులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ విషయం ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఈ విషయం పడకుండా ఉండేందుకు తమిళనాడు నేతలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ ప్రచార ర్యాలీల నిర్వహణలను ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు. ఇక వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి విద్యార్థులను సంప్రదించి, వారిని ర్యాలీలకు పంపుతున్నారు.

ప్రస్తుతం తమిళనాట విద్యార్థులదే హవా నడుస్తుంది. పార్టీలు కూడా వారు రావటానికి పెద్ద ఎత్తున్న డబ్బు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయని లోక్ సత్తా ప్రతినిధి డి.జగదీశ్వరన్ తెలిపారు. చెన్నై పరిసరాల్లో అయితే, 10 వేల మంది వరకూ, ఇతర ప్రాంతాలైతే 5 వేల మంది వరకూ విద్యార్థులను ఈవెంట్ మేనేజర్లు సరఫరా చేస్తున్నారని, కొన్ని చోట్ల విద్యార్థులు ఒకే రోజు రెండు ర్యాలీల్లో పాల్గొని రూ. 2 వేలకు పైగా తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.  ఈ వేసవి ఎన్నికలు ఒక్కో విద్యార్థికీ 30 నుంచి 40 వేల సంపాదన సమకూరుస్తాయనేది ఓ అంచనా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ