తెలంగాణా రేవంత్ రెడ్డి ఆంధ్రతో వియ్యమందుతున్నారన్న వార్త అలా రావడం కొన్నాళ్ళకే ఆయనపై ఓటుకు నోటు వ్యవహారంలో జైలుకు వెళ్ళడం పెద్ద సమస్యల్లో చిక్కుకున్నాడు. బెయిల్ పై బయటికి వచ్చిన ఈయన కూతురు నిశ్చితార్థం ఘనంగా జరిపించారు. ప్రతి రోజూ పేపర్లలో, చానళ్ళలో వార్తల్లో మనిషయినా ఈ యన కూతురు నిశ్చితార్థం కూడా ఇప్పుడు పెద్ద వార్తగా నిలిచింది. సినీ తారల నిశ్చితార్థం లాగా రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి కూడా మీడియా కవరేజ్ బాగానే జరిగింది. ఓ రాజకీయ నాయకుడి నిశ్చితార్థాన్ని మీడియా ఇంతగా కవర్ చేసిన చరిత్ర లేదు. పెళ్లికూతురు తండ్రి నిశ్చితార్థానికి ఏకంగా జైలు నుంచి రావడమే ఈ సందడికి కారణం. అందులోనే కేవలం 12గంటల బెయిల్ మాత్రమే ఇవ్వడం.
ఈ పెళ్లికి సంబంధించి ఆసక్తికరమైనఅంశాలు చాలానే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కాబోయే అల్లుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన అబ్బాయి కావటం ఒక విశేషం. అబ్బాయి పేరు సత్యనారాయణ రెడ్డి. పశ్చిమగోదావరిజిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఈ వరుడు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి సొంతూరు వచ్చేశాడు. తండ్రి చేస్తున్న వ్యాపారాల్ని దగ్గరుండి తానే చూసుకుంటున్నాడు. ఇక రేవంత్ కుమార్తె నైమిష చదువంతా హైదరాబాద్ లో సాగింది. ఇంటర్ వరకూ నాజర్ స్కూల్లో చదివిన నైమిష బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక వివాహం విషయానికి వస్తే రెండు కుటుంబాలు కూర్చొని ఒక తేదీని డిసైడ్ చేస్తాయని చెబుతున్నారు.
ఇక ఈ పెళ్ళిలో రాజకీయ నేతలనూ, మీడియా ప్రతినిధులతోనూ మాట్లాడవద్దని ఆంక్షలు విధించడం ఓ విశేషంగా మారింది. జైలు నుంచి రేవంత్ రావడం మొదలుకుని నిశ్చితార్థం మొదలయ్యేవరకూ దాదాపు అన్ని ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇచ్చాయి. ఈ శుభకార్యానికి ఎవరెవరు వస్తున్నారన్న వివరాలతో పాటు రేవంత్ పై విధించిన ఆంక్షలు ఎక్కువగా చర్చనీయాంశమయ్యాయి. కనీసం ఫోన్ కూడా మాట్లాడవద్దని ముందే ఆంక్షలున్నాయి. దీంతోపాటు.. ఏసీబీ అధికారులు, పోలీసు అధికారులు మఫ్టీలో రేవంత్ కు ఎస్కార్టుగా ఉండటం, కల్యాణవేదికపై నిఘా ఉండటం కూడా ఉత్కంఠను పెంచాయి. బహుశా తెలుగు నేలపై ఇలాంటి నిశ్చితార్థం ఇంతకుముందు జరగలేదేమో.. రేవంత్ ఆంధ్రా అల్లుడు-కూతురు జంట చూడముచ్చటగా ఉందని వచ్చినవారంతా మనసారా దీవించారు.