ఒకప్పటి తెలుగు మహిళ ప్రెసిడెంట్ గా నటించిన రోజా ఇపుడు జగన్ పార్టీ మెంబరు. మధ్యలో కాంగ్రెసు నావలో కూడా ప్రయాణం చేసిన అనుభవం. వీటన్నింటిని రంగరించి వార్తల్లో ఉండే ప్రయత్నం చేసే హాబీ గలదు. మూడు పార్టీల అనుభవం చిన్న విషయం కాదు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ మీద దాడి చేసింది. ఈ మధ్య నోరు మూసుకునే ఉంటున్నావ్. అలా ఉండేందుకు నీకు ముట్టిన దెంత? అని కథాకళి ప్రదర్శించింది. ఎవరికైనా, నీకైనా ఎక్కడి నుంచైనా ముడితే దానికి సజీవ సాక్షాలు ఎందుకుంటాయి రోజా? రేవంత్ రెడ్డిలా అమాయకంగా ఎందుకుంటారు? చంద్రబాబు తన పదవి కోసం తెలుగు జాతిని రెండు ముక్కలు చేయమని కేంద్రానికి లెటర్ ఇచ్చేడని తిడుతుంది. తను చూసిందా? మనకీ చూపించొచ్చుగా? మరో తాజా వార్త తన జోలెలోంచి తీసి మనందర్నీ స్టన్నయిపోయేలా చేసే ప్రయత్నం చేసింది. అదే రామారావు గార్ని తను ముఖ్యమంత్రి కాగోరి వెన్నుపోటు పొడిచిన చంద్ర పారాయణం చేసింది. ఇందులో నిజానిజాలు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు కరతలా మలకం. ఈ టాపిక్ లక్షా తొంభై సార్లు విన్నదే. మరో గమ్మత్తు చేసింది. చంద్రబాబు తను చేసిన అవకతవకలు, ఇపుడు చేస్తున్న భ్రష్టాచార కలాపాలు శ్వేత పత్రం ద్వారా మనకి తేటతెల్లం చెయ్యమని. ఒక పాట ఉంది. వలపుల రోజా కన్నెకూ... ముళ్ల జవానులు కాపలా! ఎందుకో గ్యాపకం వచ్చింది... కారణం తెల్వద్!