ఉరుము ఉరిమి ఉడత మీద పడినట్టు

August 13, 2015 | 02:55 PM | 4 Views
ప్రింట్ కామెంట్
security_guard_niharonline

భక్తమార్కండేయుడికి వచ్చిన ఆపద అధిగమించడానికి పరమశివుడి గర్భగుడిలోకి చొరబడి శివుడి లింగాన్ని వాటేసుకుని పద్యాలు పాటలతో గండం గట్టెక్కడంతో కథ కైలాసం చేరుతుంది.
అసలు కాపురమే గర్భగుడిలో పెడితే, అందుకే ఇంటికంటె గుడిపదిలం. పోలిక అందంగా ఉండకపోవచ్చుగానీ తప్పదు. శాస్త్రం కోసం శాల్తీలని త్యాగం చేద్దాం మరి. దున్నపోతుల కొట్లాటలో లేగదూడల కాళ్లు విరిగేయి అనేది సామెత. రాష్ట్రం రెండు ముక్కలయిన తర్వాత ఇరు పక్షాల నాయకులు శాయశక్తులా తిట్టుకు ఛస్తున్నారు... తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో రెండు అనేలా ఉంది. ఓటుకు నోటు అస్త్రం ఒక పార్టీదయితే ఫోన్ ట్యాపింగు చక్రం మరొకరిది. ఈ గోలతో రెండు రాష్ట్రాల ప్రజలు మాత్రం చొక్కాలు చించుకోకుండా ప్రశాంత చిత్తంతో వినోదిస్తున్నారు. సైన్యాధ్యక్షులు కత్తులు నూరుకుంటుంటే వందిమాగధులు బక్క ప్రాణుల మీద దాడి చేస్తున్నారు. ఆంధ్రావారు కేసీఆర్ గారి అంగరక్షకుడికి నోటీసులిచ్చేరు. వారి కొడుకు కేటీఆర్ గారి డ్రైవరుకి, గన్ మెన్ కీ ఇచ్చేరు. ఇస్తే ఏమయితది... అటువైపున్న లోకేష్ డ్రైవర్ కి ఇచ్చేరని తెలిసింది. ఇంతకీ ఇవ్వడమంటే చేతికిచ్చి రిసీవుడు అని రసీదులేం తీసుకోడం ఇరువైపులా జరగలేదు. కారణమేమిటని కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఇరు పక్షాల రసీదులు పట్టుకు తిరుగుతన్న పోలీసులకు అసలు వ్యక్తుల మొఖాలు చూసే యోగం దక్కడం లేదు. ఎందుచేత ఎవరి కోటలో వారు, వారి పెద్దల కొంగు చాటున, గుళ్లో లింగాల మాటున ముసుగేసుకొని నిశ్చింతగా బజ్జుండటం వలన!

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ