చిత్తూరు జిల్లా పుత్తూరు సీఐ కార్యాలయం ముందు శనివారం జరిగిన రాజకీయ రచ్చ తెలిసిందే. అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు, తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య జరిగిన మధ్య జరిగిన తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఇక ఈ ఘర్షణలో స్వల్ఫ గాయాలైన ఆమె ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే, ఈ గొడవ సందర్భంగా రోజా చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాదు పబ్లిసిటీ కోసమే రోజా రోడ్డెక్కింది టీడీపీ నేతలు విమర్శుల గుప్పించారు. దీనిపై రోజా స్పందిస్తూ... చంద్రబాబు ముందు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య, ఇక ఇప్పుడేమో కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడని ఆమె అన్నారు. తనను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తనను నియోజకవర్గంలోని ప్రజలంతా ఎన్నుకున్నారని, కులాలకు, వ్యక్తిగత విమర్శలకు తాను వ్యతిరేకమని ఆమె చెప్పుకోచ్చారు. తనకు కొత్తగా పబ్లిసిటీ అవసరం లేదని, సినీ నటిగా తనకు బొల్డెంతా పబ్లిసిటీ ఉందని, పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్కులు పాల్పడటం టీడీపీ వాళ్లకే చెల్లుతుందని ఆమె తిప్పికొట్టారు.