మీరేం మనుషులు... పోలీసులు పోతే పట్టించుకోరా?

April 11, 2015 | 02:28 PM | 32 Views
ప్రింట్ కామెంట్
venkaiah_naidu_fires_on_MIM_niharonline

కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ అతని బ్రుందాన్ని ఎన్ కౌంటర్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సీబీఐ విచారణ చేయించాలంటున్న ఎంఐఎం నేతల డిమాండ్ పై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఉగ్రవాదుల పక్షాన ఎంఐఎం నేతలు మాట్లాడటం సరికాదన్నారు. అదే సూర్యాపేట, అంతకుముందు జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారులు చనిపోతే వారెందుకు మాట్లాడలేదని వెంకయ్య మీడియా సాక్షిగా ప్రశ్నించారు. ఇక సామాన్యులు చనిపోతే స్పందించని హక్కుల నేతలు ఉగ్రవాదులు చనిపోతే స్పందించడం విచారకరమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్ కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోబోదని, శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని స్పష్టం చేశారు. తీవ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ విడుదలను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించిందన్న ఆయన అయినా విడుదల చేయడం దురద్రుష్టకరమని చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ