ప్రధాన ప్రతిపక్షంలేని పార్లమెంట్ మనది!

February 15, 2016 | 02:18 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Supreme court dismisses plea seeking LoP status congress niharonline

అవును... దేశ రాజకీయాల్లో తొలిసారిగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘోరంగ ఢీలాపడి కేవలం 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూర్చోలేని నెలకొంది. రెండోందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ మిగతా చిన్న చిన్న పార్టీలతో కలిసి ప్రతిపక్షాల హోదాలో పార్లమెంట్ లో అది కూర్చుంటుంది. మోదీ హవాకు కనీసం ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు కూడా గెల్చుకోలేకపోయింది కాంగ్రెస్. అయితే లోక్ సభలో అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్యా బలం ఉన్న తమకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కల్పించాలన్న కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయ్యింది.

                         పదేళ్ల పాలనకు చెక్ పడి ప్రజాతీర్పుతో 44 సీట్లలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అసలు ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోలేని పరిస్థితి. ఇదే విషయాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తో పాటు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా కాంగ్రెస్ కు తేల్చిచెప్పారు. అయినా, అవేం పట్టించుకోకుండా సుప్రీంకోర్టు గడప తొక్కింది. వాస్తవ పరిస్థితులు, గతంలో లోక్ సభ స్థితిగతులను పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానంలో కూర్చునేందుకు అర్హత లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇప్పటికే దెబ్బ మీద దెబ్బలు తింటున్న కాంగ్రెస్ కు ఈ వార్త పెద్ద షాకే. ఇక నిర్ణయం బీజేపీ చేతుల్లోనే ఉంది. దయ తలిచి వారు ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రసాదిస్తే తప్ప ఇతర మార్గలేవీ వారికి లేవు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ