నేషనల్ హెరాల్డ్ కేసులో కొంచెం ఊరట

February 12, 2016 | 01:37 PM | 1 Views
ప్రింట్ కామెంట్
SC grants personal exemption to Sonia Rahul in Herald case niharonline

సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎట్టకేలకు కాస్తంత ఊరట లభించింది. ఈ కేసు విచారణకు వారిద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు సోనియా, రాహుల్ గాంధీలు దాఖలు చేసుకున్న పిటిషన్ సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

సోనియా, రాహుల్ మరికొంత మంది కాంగ్ నేతలు భాగస్వాములుగా ఉన్న యంగ్ ఇండియా కంపెనీ ద్వారా రూ. 5వేల కోట్ల ఆస్తులున్న అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌ను రూ. 50 లక్షలకే స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీన ప్రక్రియలో నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2014లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణలో భాగంగా సోనియా, రాహుల్ తొలిసారిగా కోర్టు మెట్లెక్కారు కూడా. తదుపరి విచారణకు కూడా హాజరుకావాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో వారిద్దరూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై సమగ్ర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి వారిద్దరికి మినహాయింపునిచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ