సామాన్య సీఎంకు సుప్రీం ఉపశమనమిచ్చింది

April 17, 2015 | 05:17 PM | 53 Views
ప్రింట్ కామెంట్
aravind_kejriwal_defamation_cases_supreme_court_niharonline

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. తనపై దాఖలైన రెండు పరువు నష్టం కేసుల్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సురేంద్ర కుమార్ శర్మ అనే న్యాయవాది 2013 లో ఓ కేసు దాఖలు చేయగా, తనపై అనవసర ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది కేజ్రీవాల్ పై ఇంకో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఆయా కేసుల్లో విచారణ ప్రక్రియ నిలిచిపోనుంది. ఈ పరువు నష్టం కేసుల్లో చట్టం వ్యవహారించే తీరును ప్రశ్నిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేయగా, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం జులై 8 కి వాయిదా వేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ