పార్లమెంట్ లో ఫస్ట్ టైం సచిన్ అడిగిన ప్రశ్న

December 05, 2015 | 03:10 PM | 4 Views
ప్రింట్ కామెంట్
sachin-tendulkar-first-question-in-parliament-as-MP-niharonline

అంతర్జాతీయ క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ దేవుడు. మైదానంలో ఉండగానే రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభ సభ్యుడిగా గౌరవ హోదా అందుకున్నాడు. ఎంపీ అయి మూడేళ్లు గడిచింది. క్రికెట్ పేరుతో ఈ మూడేళ్లలో సచిన్ సభకు హాజరయ్యింది వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సభా సమావేశాలకు డుమ్మా కొట్టడంలో రికార్డులు నమోదు చేసిన వారి జాబితాలో సచిన్ చేరిపోయారు. ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజల తరపున కూడా ఈ మూడేళ్ల కాలంలో సచిన్ గళం విప్పిన  పాపాన పోలేదు. హాజరయిన ప్రతీసారీ బొమ్మలా కూర్చుండి పోవటం ఆయన వంతు అయ్యింది. ఇక క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పూర్తిస్థాయి చట్టసభ సభ్యుడిగా మారారు. డుమ్మా కొట్టకుండానే రెగ్యులర్ గా సెషన్స్ కి హాజరవుతున్నారు. అయినపప్పటికీ ఒక్కసారి మాట్లాడింది లేదు. అయితే చివరికీ గొంతు విప్పాడండోయ్. పార్లమెంటులో తన తొలి ప్రశ్నను ప్రభుత్వానికి సంధించారు.

                            ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే... ఇక్కడ కూడా ఆయన నేరుగా ఈ ప్రశ్న సంధించకపోవటం. అడగాలనుకున్న ప్రశ్నను ఆయన ఓ పేపర్ పై రాసిచ్చేశారు. దానికి ప్రభుత్వం కూడా అలాగే సమాధానం ఇచ్చింది. ఇంతకీ సచిన్ అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? ముంబై నగరం సహా పలు నగరాల్లోని సబర్బన్ రైలు వ్యవస్థను ప్రత్యేక జోన్ ను ప్రకటించాలన్నది ఆయన డిమాండ్ అట. మరో ప్రశ్న కూడా రాశాడండోయ్. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు కూడా ఓ ప్రశ్నను సంధించాడు. దానికి మాత్రం 7 న సమాధానం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందట. సచిన్ క్రీడాకారుడిగా గొప్పేకానీ నేతగా మాత్రం విఫలమతున్నాడనటానికి ఇది మరో ఉదాహరణ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ