జయలలితకు రాం రాం చెప్పేసిన స్టార్ నటుడు

February 23, 2016 | 04:09 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Sarath Kumar quits Jayalalitha AIADMK alliance Niharonline

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ ప్రకటించి పోటీకి దిగిన శరత్ కుమార్ పార్టీ సమథువా మక్కల్ కట్చి, అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని రెండు శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే దక్షిణ తమిళనాడులో బలమైన సామాజిక వర్గం నాడర్ లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన శరత్ కుమార్ ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా ఆయన జయలలితతో భేటీకి దూరంగా ఉంటున్నారు. అయితే అనూహ్యంగా శరత్ కుమార్ పార్టీనుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే నారాయణరావు జయలలిత పార్టీకి చేరువయ్యారు. దీంతో అతనిని శరత్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ సారి మరింత పటిష్ఠమైన ప్రణాళికతో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని శరత్ కుమార్ భావిస్తున్నారు.

                                  అందులో భాగంగా ఆయన అన్నాడీఏంకేతో తెగతెంపులు చేసుకున్నారు. గతంలో అన్నాడీఎంకేతో కొనసాగుతానని మాటఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఇంత కాలం కూటమిలో కొనసాగానని శరత్ కుమార్ పేర్కొన్నాడు. ఈ తెగదెంపులుకి ఆ పార్టీని నిందించేందుకు ఏమీ లేదని చెప్పిన ఆయన, వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన దానికంటే చేయాల్సిందే ఎక్కువ ఉందని, లక్ష్యం సాధించేందుకే కూటమి నుంచి వైదొలిగానని ఆయన పేర్కొన్నారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో తనను బలపరచకపోగా, పరోక్షంగా విశాల్ వర్గానికి మద్ధతు ప్రకటించారని శరత్ కుమార్ అన్నాడీఎంకే పై గుస్సాతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతో ఇప్పుడు ఈ తెగదెంపులు జరుగుతున్నాయన్నది మరో వర్గం వాదన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ