పోలీసులతో మహిళా ఎమ్మెల్యే మిస్ బిహేవ్

November 23, 2015 | 11:41 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Sarita_Singh_AAP_misbehaves_with_cop_niharonline

సంచలనాలు సృష్టించటంతోపాటు, దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. ఆ మధ్య సోమ్ నాథ్ భారతి వ్యవహారంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిన విషయం తెలసిందే. తామేం వివాదాలకు అతీతం కాదు అంటూ అప్పుడప్పుడూ ఆ పార్టీ నేతలంతా వివాదాల్లోకి దిగుతున్నారు. ఇక తాజాగా ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఢిల్లీ నడి వీధుల్లో ఓ పోలీసు అధికారిపై తిట్ల దండకం అందుకున్నారు. కారుతో సదరు పోలీసు అధికారిని గుద్దేయడమే కాక ఆయనపైనే నోరుపారేసుకున్న సదరు ఎమ్మెల్యేపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

                                రోహతష్ నగర్‌లో ఆప్ ఎమ్మెల్యే సరితా సింగ్ కారు బైకుపై వెళుతున్న ఏఎస్సై ఓమ్ పాల్ ను ఢీకొట్టంది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఓమ్ పాల్ ఎమ్మెల్యే సరితా సింగ్ కారు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. వెంటనే కారు దిగిన సరితా సింగ్ ఏఎస్సైపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. కారుతో తన బైకును ఢీకొట్టమే కాక తనపైనే తిట్ల దండకం అందుకున్నారు. అంతటితో ఆగక బైక్ పై వెళ్తున్న మరోవ్యక్తిపై పిడిగుద్దులు కురిపించారట. దీంతో బాధిత పోలీస్ అధికారి సరితా సింగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వారు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉంటే, ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా, ఈ ఉదంతంపై ఆమె స్పందిస్తూ పోలీస్ అధికారి తనను దూషించటంతోనే దాడికి దిగానని, ఢిల్లీ పోలీసులు మొదటి నుంచే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ