శివసేనకు తగిలిన షాక్ మాములుది కాదు

April 21, 2016 | 11:23 AM | 1 Views
ప్రింట్ కామెంట్
shivsena-leader-convert-islam-niharonline

హిందు భావజాలాలను అణువణువునా నింపుకుని, మత వ్యతిరేక చర్యలపై పోరాటం చేస్తున్న పార్టీల్లో శివసేన ఒకటి. హిందువులను బలవంతంగా ముస్లింలుగా మార్చారని ఆరోపిస్తూ, ఘర్ వాపసీ పేరిట వారిని తిరిగి హిందువులుగా మార్చేందుకు వీహెచ్ పీ తో కలిసి శివసేన చేస్తున్న ప్రయత్నాలు తెలిసినవే. అయితే అలాంటి క్రమంలో ఆ పార్టీకి ఊహించని పెద్ద షాక్ తగిలింది. శివసేన నేత ఒకరు ముస్లిం మతం స్వీకరించి వార్తల్లో నిలిచారు.

                                  ఉత్తరప్రదేశ్ కు చెందిన సుశీల్ కుమార్ జైన్ ముస్లిం మతం స్వీకరించి మహమ్మద్ అబ్దుల్ సమాద్ గా పేరును మార్చుకున్నాడు. ఈ విషయాన్ని ఓ టాప్ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. జైన మతం వ్యవహారాలు నచ్చకపోవడం, రెవెన్యూ విభాగం పనితీరు అసంతప్తిగా ఉండటం, మున్సిపల్ కార్పొరేషన్ పద్ధతులు బాగాలేవని ఆరోపిస్తూ, ఆయన మతం మార్చుకున్నట్టు ఆ కథనం పేర్కొంది. ఫిబ్రవరి 15వ తేదీన ఎవరి బలవంతం లేకుండానే ఆయన మతం మారారని తెలుస్తోంది. కాగా,  ఈ వార్త మంగళవారం మహావీర్ జయంతి సందర్భంగా బయటకు రాగా, ముజఫర్ నగర్ జిల్లా ఖతౌలీ పట్టణంలో ఇప్పుడు సంచలనంగా మారింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ