రైతుల కోసం పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు గుప్పించింది. ఇప్పుడు రైతుల కన్నీళ్లు తుడవడానికి వచ్చిన రాహుల్, కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాళ్లు ఏంచేశాడని నిలదీసింది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు కన్నీళ్లేందుకు తుడవలేదు? మీ సర్కార్ రైతులకిచ్చిన వాగ్దానాలు ఏమాయ్యాయి? రైతులను రుణ విముక్తులను చేస్తామని అప్పుడు మీరెందుకు భరోసా ఇవ్వలేదు? అంటూ తన సామ్నా పత్రికలో సంపాదకీయంలో ఏకీపారేసింది. ఇప్పుడొచ్చి రైతుల పక్కన కూర్చుని టీ, బిస్కెట్లు తినటం మరింత సిగ్గుచేటని విమర్శించింది.