తెలుగు రాష్ట్రాల మధ్య నానాటికీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించింది. విభజన జరిగిన మాదిరిగానే తక్షణమే హైకోర్టునూ విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం పార్లమెంట్ బయట వెలుపల ఆందోళనలకు దిగారు. సభలో స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పందించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ ఈ విషయంలో సభలో విస్పష్టమైన ప్రకటన చేశారు. హైకోర్టు విభజనకు సంబంధించి ఇటీవల ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని పరిశీలించిన తర్వాతే తదుపరి కార్యచరణను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.