ప్రముఖుల, సెలబ్రిటీల పర్సనల్ విషయాలు బయటికి వచ్చినప్పుడు చర్చనీయాంశం కావటం సహాజమే. ముఖ్యంగా వైవాహిక జీవితాలకు సంబంధించినవి ఐతే మరీనూ. రహాస్యాలు అయినప్పటికీ వారి ద్వారా కావచ్చు, పరోక్షంగా అయినా అవి ఎప్పుడో ఒకప్పుడు బయటపడక మానవు.
నెహ్రూ మనవడు, ఇందిరాగాంధీ తనయుడు, కాంగ్రెస్ అధినేత్రి రాజీవ్ గాంధీ వివాహ జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వెలుగుచూసింది. పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి తాజాగా ఓ పుస్తకం రాశారు. దానిపేరు ‘‘నైదర్ ఏ హాక్ నార్ ఏ డవ్’’. ఆసక్తికర అంశాలు ఆ పుస్తకంలో చాలానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక్క అంశం బాగా చర్చనీయాంశమైంది. కసూరితో కాంగ్రెస్ అధినేత్రి 2005 లో సరదా మాట్లాడిన ఓ ఉదంతాన్ని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు.
అసలు రాజీవ్ గాంధీని సోనియాని ఎందుకు పెళ్లిచేసుకుందో ఆయన అందులో వివరంగా తెలిపారు. ‘‘అప్పట్లో కేంబ్రిడ్జ్ వర్సిటీలో చదువుతున్నా. నా ఎదురుగా ఓ అందమైన యువకుడు వెళుతున్నాడు. నా పక్కనే ఉన్న సోహైల్(కాంగ్రెస్ నేత ఇఫ్తికరుద్దీన్ కుమారుడు) ను అతనెవరని అడిగా. అతను భారత్ ఒకప్పటి ప్రధాని పండిట్ జవరహార్ లాల్ నెహ్రూ మనవడు రాజీవ్ అని చెప్పారు. దీంతో ఆయన్ను నేను చిరునవ్వుతో పలుకరించా’’ అని సోనియా చెప్పినట్లుగా కసూరి పుస్తకంలో రాశాడు. మొత్తానికి సోనియా రాజీవ్ లో ఏం చూసి పడిపోయిందో అర్థమైంది కదా. కానీ, ఇక్కడ ఓ చిన్న లాజిక్ ఏంటంటే ఆయన(సోహైల్ )ముందుగా నెహ్రూ మనవడు అని చెప్పాడు. మరి కరెక్ట్ రీజన్ ఏమై ఉంటుందబ్బా?