రాజీవ్ హంతకుల పనిపట్టే టైమొచ్చింది

December 02, 2015 | 10:00 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Supreme_Court_verdict_on_Rajiv_Gandhi_convicts_release_niharonline

భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు నేడు కీలక నిర్ణయం వెలువరించనుంది. ఈ కేసులో దోషుల తేలిన నిందితుల భవిష్యత్తుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తుది తీర్పు వెలువరించనుంది. హంతకులు మురుగన్, పెరారివలన్, శంతనులకు ఖరారైన ఉరిశిక్షను సుప్రీంకోర్టు జీవిత ఖైదుగా మార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల పాటు రాష్ట్రపతి నిలయంలో దోషుల క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే గతేడాది సుప్రీంకోర్టు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

దోషుల శిక్షా కాలాన్ని తగ్గించడంతో పాటు వారిని విడుదల చేసేందుకు గతంలో తమిళనాడు ప్రభుత్వం యత్నించింది. దీంతో, ఈ యత్నాన్ని నిలిపేసిన సుప్రీంకోర్టు మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణను చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యవహారంపై తుది తీర్పు వెలువరించనుంది.

తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో మే 21 మానవ బాంబు దాడిలో రాజీవ్ గాంధీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఏడుగురు నిందితులు పలుసార్లు అభ్యర్థన చేసుకోగా, సుప్రీం దానిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రాజీవ్ హంతకులు విడుదలవుతారా? లేక ఇంకా జైలులోనే మగ్గాల్సి వస్తుందా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ