సురేష్ గోపీ ఓ కట్ వేసుకుంటే...

April 23, 2016 | 05:28 PM | 1 Views
ప్రింట్ కామెంట్
suresh-gopi-reel-life-real-life-dialogues-Nominated_MP_niharonline

తను కొట్టిన డైలాగులు తిరిగి తనకే వర్తిస్తాయని బహుశా ఆ స్టార్ నటుడు ఊహించి ఉండడు. సురేష్ గోపీ మాలీవుడ్ లో పెద్ద యాక్షన్ హీరో, తాజాగా బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. తన ప్రతి సినిమాలోనూ రాజకీయనాయకులు, రౌడీలను ఆయన ఛడామడా తిట్టేస్తూ విశ్వరూపం ప్రదర్శిస్తుంటారు. ఆవేశంతో ఊగిపోతూ సాయి కుమార్ తో గుక్క తిప్పుకోకుండా  చెప్పించిన డైలాగులతో  ఆ డబ్బింగ్ సినిమాలుగా తెలుగులోనూ బాగానే ఆడాయి.

                            తాగా ఆయన ఎంపీ పదవి దక్కించుకోవడంతో గతంలో ఆయన నటించిన ఓ సినిమాలో నామినేటెడ్ ఎంపీలపై సంధించిన డైలాగ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఎన్నికల్లో ప్రజాభిమానం సంపాదించలేని రాజకీయ నాయకులే ఇలా దొడ్డిదారిన పదవులు సంపాదిస్తారు. అలాంటి నాయకులు సమాజానికి చీడపురుగుల్లాంటి వాళ్లు' అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇక  మరో సందర్భంలో 'బాగా డబ్బున్న ఎన్నారైలు, మద్యం వ్యాపారులు నల్లధనాన్ని ఎరగా వేసి, ఇలాంటి విలువైన పదవులు కొనుక్కొంటున్నారు' అంటూ ఆయన డైలాగులు ఉంటాయి.  ఇప్పుడు ఆయన డైలాగులు ఆయనకే పంచ్ లుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ