మానవత్వం పరిమళించిందండీ!

July 20, 2015 | 04:20 PM | 3 Views
ప్రింట్ కామెంట్
pratyusha_kcr_global_hospital_ravindranath_niharonline

ప్రత్యూష పేరు తలచగానే హైదరాబాదీలకు గుండె కలుక్కుమనే వేదనాభరితమైన జ్నాపకాలు మెదులుతాయి. గతంలో మోహన్ బాబు సినిమాలో నటించి అందరికీ అభిమాన పాత్రమైన ఆ ప్రత్యూష 2002 ఫిబ్రవరిలో ధన, అధికార గర్వానికి బలయిన సంఘటన నగరవాసులు మరువలేదు. జరిగిన దారుణాన్ని మసిపూసి మారేడుకాయ చేసిన పెద్దల ఘనకార్యం, నేరస్థులయిన ఆ రాక్షస యువత నిర్వాకం, వివరంగా సమాజానికి ఎరుకనే!

 ఆపాయ్యంగా చూసుకోవాల్సిన వాళ్లే ఈ ప్రత్యూష విషయంలో ప్రవర్తించిన తీరు ఊహాతీతం. ఎంతటి దారుణమంటే విషయం తెలుసుకొని ప్రత్యూష్ ఇంటికి వెళ్లిన పోలీసులే కన్నీళ్లు పెట్టేరంటే,  ఆ ఘోరానికి చలించిపోయారంటే ఊహించండి. గ్లోబల్ అవేర్ హస్పిటల్ ప్రత్యూష విషయంలో చొరవ చూపించి ఆదుకోవడం సమాజం యావత్తూ హర్షించి ‘స్టాండింగ్ ఒవేషన్’ అందిస్తోంది. హాస్పిటల్ అధినేత డాక్టర్ కె.రవీంద్రనాథ్ కు ఇటువంటి మానవత్వపు పరిమళాలద్దుతూ చేపట్టిన కార్యక్రమాలు కొత్తేమీ కాదు. గతంలో అపోలో హాస్పిటల్ లో పనిచేస్తుండగా కృష్ణవేణి అనే పేషంట్ సీరియస్ లివర్ సమస్యతో (కొలిడియో కొల్తయాసిస్) చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు ఈ విషయాన్ని రవీంద్రనాథ్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఆయన సహృదయంతో ముందుకొచ్చి పూర్తి బాధ్యత వహించి ఏ విధమైన ఖర్చులేకుండా ఆపరేషన్ చేసి పెట్టేరు. అది కూడా తన డాక్టర్ల బృందం మొత్తం సహకరించేలా మాట్లాడి. ప్రస్తుతం కేసీఆర్ ముందుకొచ్చి ప్రత్యూష్ బాగోగులు చూసుకోగలనని ప్రకటించడం, భూమ్మీద మంచితనం ఇంకా బ్రతికి ఉందనిపిస్తోంది. చాలా థాంక్స్ కేసీఆర్ అండ్ రవీంద్రనాథ్ గారూ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ