గ్రేటర్ చిచ్చు వరంగల్ కి ఎక్కింది

February 25, 2016 | 11:53 AM | 1 Views
ప్రింట్ కామెంట్
TDP-BJP-not alliance-for warangal carporation elections-niharonline

కారు దెబ్బకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మిత్రపక్షాలు కకావికలం అయి పోయాయి. కలసి పోటీకి దిగినప్పటికీ తెలుగుదేశం, బీజేపీలు కొలుకోలేనతంగా ఘోరంగా దెబ్బతిన్నాయి. గత ఎన్నికల్లో సీట్ల కన్నా ఓ సీటు తగ్గి బీజేపీ భంగపడగా, టీడీపీ పరిస్థితి ఏమయిందో అందరికీ తెలిసింది. అయితే సీట్ల పంపకంలో సరిగ్గా లేనందునే దారుణ ఓటమి చెందినట్లు ఆయా పార్టీలు స్టేట్ మెంట్లు ఇచ్చుకున్నాయి. ఓటమికి మీరు కారణమంటే, కాదు మీరే కారణమని టీడీపీ, బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రభావం కార్పొరేషన్ ఎన్నికలపై పడినట్లు తెలుస్తోంది.

                              నిజానికి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముందు మిత్రపక్షంగానే కొనసాగుదామని నిర్ణయించుకున్నప్పటికీ ఆ తర్వాతి పరిణామాలు బాగా దెబ్బతీశాయి. మొత్తం 58 డివిజన్లు ఉండగా, తెలుగుదేశం 48 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, బీజేపీ 43 మందిని బరిలోకి దింపింది. మిగిలిన 10 స్థానాల్లో ఆరింటిలో తమ అభ్యర్థులుంటారని, మిగతా నాలుగు చోట్ల ఇండిపెండెంట్లకు మద్దతిస్తామని తెలుగుదేశం చెబుతుండగా, మిగిలిన 15 డివిజన్లలో ఇతరులకు మద్దతిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు పార్టీలూ కలసి పోరుకు దిగడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు పార్టీల కీలకనేతలు కూడా ఎవరూ స్పందిచకపోవటంతో దాదాపు దీన్నే నిర్ధారించుకోవచ్చన్నమాట.

ఈ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిపోగా, పలు పార్టీలు ఇంకా అభ్యర్థుల పేర్లనే ఖరారు చేయలేదు. విచిత్రమేంటంటే... టీఆర్ఎస్ మరో 10 డివిజన్లలో అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించ లేదు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క పేరు కూడా చెప్పలేదు. ఆశావహులు మాత్రం నామినేషన్లు వేసేసి, తమకే బీఫాం వస్తుందన్న ధీమాలో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ