వైకాపా డెడ్ లైన్ ఫిక్సయ్యిందా?

February 24, 2016 | 05:14 PM | 2 Views
ప్రింట్ కామెంట్
YSRCP-deadline-fixed-2019-somireddy-niharonline

తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ అన్నాడో లేదో తెలీదుగానీ, వైకాపా నుంచి వరుస జంప్ లు కొనసాగుతున్నాయి. మొన్న భూమా లాంటి కీలకనేతతో సహా నలుగురు చేరగా, ఈరోజు బద్వేల్ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేశాడు. దీంతో వైకాపా చేరికలపై చర్చించేందుకు ముందుకు కదిలింది. అసలు ఎందుకిలా జరుగుతుందని ఆరా తీసే పనిలో పడ్డాడు జగన్. అయితే వైకాపా కు చాలా టైం ఉందని చెబుతున్నారు తెలుగుదేశం సీనియర్ నేత సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 2019 సంవత్సరం వైకాపాకు డెడ్ లైన్ అని, ఈలోగా అభివృద్ధి వ్యతిరేక విధానాలను వీడకపోతే, జగన్ పై ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆయన హెచ్చరించారు.

అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, తాజాగా కేసీఆర్ లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు చూస్తూ జగన్ రాక్షసానందం పొందలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేలు తామంతట తాము పార్టీలోకి వస్తుంటే తప్పుబడటం కరెక్ట్ కాదని ఆయన చెబుతున్నాడు. రాజకీయ నేతలు అభివృద్ధిని కోరుకోవడం ఎంత సహజమేనని, పార్టీ మారడం కూడా అంతే సహజమని అన్నారు. అసలు టీడీపీ ఎమ్మెల్యేలను తాకే ధైర్యం కూడా జగన్ కు లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే సామర్థ్యం అంతకన్నా లేదని సోమిరెడ్డి ఎత్తిపొడిచారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలను బట్టి వైకాపా వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేనందునే ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయనేది అంచనా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ