రోజా దెబ్బకు ఏడ్చేసిన మహిళా ఎమ్మెల్యే

December 22, 2015 | 02:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
MLA-anitha-cry-in-assembly-on-roja-comments-niharonline

ఓవైపు వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడుకి పోతుంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని, సాటి మహిళా ఎమ్మెల్యేను అనుచిత వ్యాఖ్యలతో కించపరిచారామె. కామ(కాల్ మనీ స్కాం) పై చర్చ సందర్భంగా స్పందిస్తూ చంద్రబాబు ఓ కామ సీఎం... సెక్స్ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించిన రోజా, ఆపై పాకాయరావుపేట ఎమ్మెల్యే అనితపై చెప్పలేని రీతిలో వ్యక్తిగత దూషణకు దిగారు. ‘‘రోజుకొకడితో పడుకునే నువ్వేంటి మాట్లాడేది?’’ అంటూ ఆ దళిత మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేశారు.  ఒక గౌరవనీయమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న సభ్యురాలి నోటినుంచి అలాంటి మాటలు వస్తే ఎలా? ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని వెనకేసుకు రావటం కరక్టేనా?

ఇక ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలతో సమావేశాలకు దూరమైన ఎమ్మెల్యే మంగళవారం సభకు హాజరయ్యారు. రోజా తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆనిత ఆవేదన వ్యక్తం చేశారు. మాటలతో చెప్పలేని విధంగా తనను రోజా దూషించారని చెప్పారు. రోజా వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థంకాక, తాను రెండు రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని, శాసనసభ సమావేశాలకు కూడా హాజరు కాలేకపోయానని అన్నారు. ఒక మహిళ అయి ఉండి కూడా సాటి మహిళపై దారుణ వ్యాఖ్యలు చేయడం అమానుషమని కంటతడిపెట్టుకున్నారు. వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రోజా మాట్లాడటం దారుణమని అన్నారు. తనకు న్యాయం చేయాలని స్పీకర్ ను కోరారు. సాటి మహిళల పట్ల గౌరవం లేని రోజా లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్న వైకాపా అధినేత జగన్ ఏ విధంగా ప్రజల్లోకి వెళతారని ప్రశ్నించారు. దళిత మహిళను అవమానించిన వ్యక్తిని సభ నుంచి బహిష్కరిస్తే, సభనే బహిష్కరిస్తారా అంటూ జగన్ ను ప్రశ్నించారు. ఇదే ఘటన మీ ఇంట్లో ఉన్న ఆడవారికి జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని జగన్ ను నిలదీశారు. వీటికి ఆయన దగ్గర సమాధానం ఉందని అనుకోవటం పొరపాటే అవుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ