గల్లా నిరసన గళం ఎ౦దుక౦టే?

October 23, 2015 | 12:21 PM | 2 Views
ప్రింట్ కామెంట్
MP-Jaydev-Galla-on-PM-modi-speech-niharonline

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోదీ దాదాపుగా అందరినీ నిరాశకు గురి చేశారు. ప్రత్యేక హోదాపై మోదీ నోట నుంచి ప్రకటన వస్తుందని ఆశించిన వారంతా, దానిపై ఆయన నోరు మెదపకపోవడంతో కంగుతిన్నారు. విపక్షాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఇక అధికార టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిరసనకు దిగలేదు కానీ, నిరసన గళం మాత్రం వినిపించారు.

గుంటూరులో మీడియాతో మాట్లాడిన గల్లా జయదేవ్, మోదీ ప్రసంగం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా అవసరమేనని ఆయన వాదించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో ఎమోషనల్ ఇష్యూగా మారిపోయిందని చెప్పారు. ఇక కార్యక్రమ ఏర్పాట్లపైనా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ ను పిలిచి వేదికపై కుర్చీలేసిన నేతలకు, స్థానిక సర్పంచ్, స్థానిక ప్రజా ప్రతినిధులు గుర్తుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

నిరసన గళం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్దకు చేరిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై నిరసన వినిపించడమే కాక ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి ఏమీ సాధించలేమని కూడా గల్లా వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి స్ధాయిలో సమాచారం అందుకున్న చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజధాని కమిటీ సభ్యులతో భేటీ కానున్న చంద్రబాబు, ఈ వ్యాఖ్యలపైనా చర్చించే అకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు గల్లా వ్యాఖ్యలపై పెద్దగా చర్చ జరగకున్నా, రాజధాని కమిటీ భేటీ ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ