అమ్మాయిలకు ఐష్, అబ్బాయిలకు చెర్రీ ఆదర్శమన్న ఎంపీ

November 04, 2015 | 10:42 AM | 3 Views
ప్రింట్ కామెంట్
MP-malla-reddy-love-lessions-aishwarya-rai-ram-charan-niharonline

సాధారణంగా నేతలకు వివాదాస్పద వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ, ఈ ఎంపీ కాస్త వైవిధ్యతను ప్రదర్శించారు. రోటీన్ భిన్నంగా ఆలోచించి, ప్రేమ పాఠాలు బోధించాడు. బాగా బలిసిన పార్టీలను పటాయించి లైఫ్ సెటిల్ చేసుకోండ్రా అని స్టూడెంట్స్ కి సలహా ఇచ్చారు. ఆయనేవరో కాదు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డిగారు. తెరాస హవాను తట్టుకుని మరీ తెలంగాణలో గెలిచిన ఏకైక టీడీపీ ఎంపీ. విద్యాసంస్థల అధినేతగా ఓ కాలేజీ పంక్షన్ వెళ్లిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ఆయన పంక్షన్లో హాడావుడి మాములుగా ఉండదు. ఆమధ్య తన కాలేజీ పంక్షన్లో విద్యార్థులతో కలిసి గంగ్నమ్ డాన్స్ చేసి విద్యార్థులను ఉత్సహా పరిచిన ఆయన ఇప్పుడు కాస్త ముందుకు వెళ్లారు. పెద్దాయన కదా ఓ నాలుగు మంచి మాటలు చెప్పమని మైక్ ఆయనకు ఇచ్చారు నిర్వాహకులు. అయితే క్లాస్ పీకుతారని భావించిన ఆయన నుంచి వచ్చిన ఉపన్యాసం విని షాక్ తినటం విద్యార్థుల వంతు అయ్యింది.

ప్రేమ పాఠాలు నేర్చుకోండ్రా అని విద్యార్థులకు చెప్పారట. అబ్బాయిలు, అమ్మాయిలు బాగా ఆస్తులున్న వారిని చూసి పటాయించాలని విద్యార్థులకు హితబోధ చేశారట. ఇందుకోసం ఆయన గారు చెప్పిన ఎగ్జాంపుల్స్ విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట. ఐశ్వర్యరాయ్ తెలుసుగా ఎంత పెద్ద అందగత్తో. ఎందరో ఆమె వెంట పడ్డారు. కానీ, ఆ యమ్మి ఎవరి మాట వినిందా? లేదు కదా. ఎవరిని చేసుకుంది. అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ ను  చేసుకుంది. లైఫ్ హ్యాపీగా సెటిల్ చేసుకుంది. అమ్మాయిలంతా ఐశ్వర్యరాయ్ ని చూసి నేర్చుకోండి. ఇక హీరో రాంచరణ్ ఉన్నాడుగా. ఆయన ఎవరిని పటాయించాడో చూడండి. అపోలో హాస్పిటల్స్ అధినేత మనవడిని లైన్లో పెట్టి పడేశాడు. పడితే అలా పట్టాలి గానీ, దారిన పోయే దరిద్ర్యాన్ని మాత్రం నెత్తిన వేసుకోకండి అని యువతకు పిలుపునిచ్చాడు. చివర్లో ఇదంతా ముప్ఫై ఏళ్లు వచ్చే వరకే సుమా అని కూడా సలహా ఇచ్చారట. ఇక అక్కడున్న వారి ఎక్స్ ప్రెషన్లు ఏంటో మీరే ఊహించుకోండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ