చంద్రబాబుకి అది చేత కాదా?

September 10, 2015 | 10:45 AM | 2 Views
ప్రింట్ కామెంట్
chandrababu-naidu-on-TDP-groups-war-niharonline.jpg

అధికారాన్ని తిరిగి చేపట్టి తిరుగులేకుండా అనుభవిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క విషయంలో మాత్రం పొరపాటు చేస్తునే ఉన్నారు. ప్రతిపక్షంగా ఉన్న టైంలో పార్టీ కేడర్ పై పూర్తి దృష్టి ఉంచిన బాబు అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా విస్మరించారు. దీంతో పార్టీ కేడర్ ను కంట్రోల్ లో ఉంచటంలో విఫలమవుతూ వస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రగిలిన రగడ మరువక ముందే... తాజగా నేతలు మరో రచ్చతో రోడ్డున పడ్డారు. అయితే ఒకేరోజు రెండు జిల్లాలో ఈ గ్రూప్ రాజకీయాలు బయటపడటం విశేషం.

ప్రకాశం జిల్లా చీరాల.. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో అధికారపార్టీకి చెందిన నేతలు గ్రూఫులుగా విడిపోయి రోడ్డు మీద పడి కొట్టుకునే దుస్ధితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఇటీవల పార్టీలో చేరారు. ఇక సార్వత్రి ఎన్నికల సమయంలో పోటీచేసి ఓడిన పోతుల సునీత. వీరి వర్గాల మధ్య గొడవ చోటు చేసుకోవటం.. రోడ్డుమీదకి చేరి తన్నుకోవటంతో పాటు పరువుపోయినట్లయ్యింది. శ్రీకాకుళంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అవలంగి గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా చీలిపోయి కొట్టేసుకున్న దుస్థితి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం పెద్దగా పని ఉండదు కాబట్టి పూర్తిగా పార్టీ మీదే దృష్టి ఉండొచ్చు. కానీ, అధికారంలో  వచ్చాక అది కాస్త కష్టమే. కానీ, వైఎస్ లాంటి నేతలు సీఎం గా ఉన్న సమయంలోనే పార్టీని మరింత పట్టులో ఉంచుకున్నారు. మరి తొమిదేళ్లు సీఎంగా చేసిన బాబుకి అది సాధ్యమయ్యే పనికాదా? తెలుగుదేశం లాంటి పార్టీలో అంతర్గత క్రమశిక్షణ ఎక్కువన్న వాదన ఒక్కప్పుడు ఉండేది. దాని కాలరాస్తూ ఇప్పుడు రోడ్డుమీదకొచ్చి గొడవలు పడటం, బాబు పరువును బజారుకీడ్చటం కాస్త ఆందోళన కలిగించే అంశమే. మరి ఇలాంటి టైంలో ప్రతిపక్షాలు జోక్యం చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో అయినా పార్టీ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఎంతైనా లేకపోలేదు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ