జంపర్లకు పొట్టేలు పున్నమ్మ కథ అంకితమిచ్చాడు

May 28, 2015 | 02:55 PM | 2 Views
ప్రింట్ కామెంట్
chandra_babu_naidu_speech_at_mahanadu_niharonline

మహానాడు వేదికగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీ మారిన వ్యక్తులకు చురకలంటించారు. పార్టీలో ఉన్నంత కాలం పదవులు అనుభవించి కష్ట కాలంలో పార్టీని వదిలి వెళ్లిన ద్రోహులనీ విరుచుకుపడ్డారు. పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఎదురైన అనుభవాన్ని ఆయన చెప్పారు. పాదయాత్ర సందర్భంగా ఒక గ్రామంలో పర్యటిస్తుండగా ఓ మహిళ దాని వెనకాలే ఓ పొట్టేలు వెళ్లటం బాబు గమనించారట. ఆమెను ఆపి పొట్టేలు నీవెనకాలే వస్తుంది. ఎందుకమ్మా అని బాబు ఆమెను అడిగారట. దానికి ఆమె దానికి గడ్డి పెట్టాను అందుకే నా వెనకాల వస్తుంది అని చెప్పిందట. మరీ నా వెనకాల కూడా వస్తుందా అని బాబు ఎదురు ప్రశ్న అడిగారట. దానికి ఆ మహిళ మీరూ గడ్డి పెట్టండి మీ వెనకాల కూడా రావచ్చు అని సమాధానమిచ్చిందట. బాబు దానికి గడ్డి పెట్టినప్పటికీ తినకుండా ఆమె వెనకాలే వెళ్లిపోయిందట.

                     కాస్త గడ్డి పెట్టినందుకే యజమానిరాలి మీద ఆ పొట్టేలు ఎంతో విశ్వాసం చూపింది. అలాంటిది పార్టీలో ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తులు పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు విమర్శలు చేసి మరీ వెళ్లిపోయారన్నారు. ప్రలోభాలకు లొంగి కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహాం చేశారని, విశ్వసనీయతను వారు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తంచేశారు చంద్రబాబు. జంప్ జిలానీలపై ఇంతవరకు చంద్రబాబు ఎక్కడా పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ, మహానాడు వేదికగా ఇలా విరుచుకుపడటం టీ టీడీపీ నేతలకు బూస్ట్ అందించినట్లయ్యింది.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ