హమ్మయ్యా... అమరావతికి ‘గ్రీన్’ సిగ్నల్

May 28, 2015 | 11:15 AM | 4 Views
ప్రింట్ కామెంట్
national_green_tribunal_ok_to_Amravati_niharonline

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తే వరదలతో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశాడు. రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలో నది ఒడ్డున సారవంతమైన పంట భూములు ఉన్నాయని, రాజధానిని నిర్మిస్తే కాలుష్యంతోపాటు సహజ సంపదకు నష్టం కలుగుతుందని పందలనేని శ్రీమన్నారయణ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. దీనిపై విచారించిన ట్రిబ్యునల్ పర్యావరణ ప్రభావ మదింపు జరపాలన్న అంశంపై మాత్రమే విచారణ చేపడతామని చెబుతూ కేసును వాయిదా వేసింది. అంతేకానీ ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం చేపడుతన్న రాజధాని నిర్మాణాన్ని ఆపలేమని ట్రిబ్యునల్ తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ